News February 10, 2025
అల్లూరి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

అల్లూరి జిల్లా మన్యంలో 11వ తేదీన జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మన్యంలో బంద్ జరుగుతున్నందున ఈ తేదీలు మార్చుతున్నట్లు చెప్పారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. బంద్ వలన ఈ మార్పు గుర్తించి తదుపరి తేదీ తెలుసుకొని పరీక్షకు రావలసిందిగా కలెక్టర్ ప్రకటించారు.
Similar News
News January 3, 2026
అవుకులో విషాదం

అవుకు పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శివరాం(42) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వృత్తి రీత్యా డ్రైవర్‌గా జీవనం సాగించే శివరాం శుక్రవారం తాడిపత్రి అటో నగర్‌లో టిప్పర్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. శివరాం మృతితో అవుకు పట్టణంలో విషాదం నెలకొంది.
News January 3, 2026
సామాజిక రుగ్మతల తొలగింపునకు కృషి చేయాలి: కలెక్టర్

విద్యార్థులకు బోధనతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి సామాజిక రుగ్మతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బి.ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. శనివారం గద్వాల ఐడీఓసీలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్.. తొలి మహిళా ఉపాధ్యాయురాలి ఆశయాలను కొనసాగించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News January 3, 2026
ఈ ఏడాదిలో 835 అగ్ని ప్రమాదాలు.. REPORT

2025కు సంబంధించిన అగ్ని ప్రమాదాల నివేదిక వెలువడింది. ప్రతి సంవత్సరం అగ్నిప్రమాదాలు పెరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 835 అగ్ని ప్రమాదాలు జరగగా రూ.32 కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. GHMC పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.


