News August 12, 2024
అల్లూరి జిల్లాలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం
అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే గంజాయి రవాణాపై ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. పాడేరు ఎస్ఐ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో డాగ్ స్క్వాడ్ బృందం ఘాట్ మార్గంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే పెదబయలు మండలం రూడ గోమంగి పరిసరాల్లో కూంబింగ్ విస్తృతం చేశారు. హుకుంపేట, చింతపల్లి మండల కేంద్రంలో వచ్చే వాహనాలన్నీ తనిఖీలు చేస్తున్నారు.
Similar News
News September 18, 2024
విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.
News September 18, 2024
ఏపీలో మొదటి స్థానంలో విశాఖ రైల్వే స్టేషన్
ఆదాయ ఆర్జనలో విశాఖ రైల్వే స్టేషన్ ఏపీలో మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రాకపోకల ద్వారా రూ.564 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏపీలో టాప్ 30 రైల్వేస్టేషన్లలో కూడా విశాఖ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తిరుపతి విజయవాడ స్టేషన్‌లతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల విషయంలో వెనుకంజలో ఉంది.
News September 17, 2024
విశాఖలో ఆన్‌లైన్ వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్
విశాఖలోని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టును సైబర్ క్రైమ్ టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. నగర కమిషనర్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఏజెంట్ల సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న రావాడ కామరాజుతో పాటు రమేశ్, సుభద్ర, సూర్యవంశీ, రాములను అరెస్టు చేశారు. 34 మంది ఏజెంట్ల డేటాను భద్రపరిచి అనాధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.