News March 23, 2025

అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

image

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్‌లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్‌తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.

Similar News

News September 13, 2025

నేడు మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.

News September 13, 2025

MNCL: ఈనెల 22న PLR బోనస్‌పై జేబీసీసీఐ సమావేశం

image

బొగ్గు పరిశ్రమలోని కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా అందించే పనితీరు ఆధారిత రివార్డు (PLR) చెల్లింపుపై ఈనెల 22న ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలో జేబీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ మేరకు కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌతమ్ బెనర్జీ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ గౌతమ్ పొట్రుతో పాటు దేశంలోని బొగ్గు పరిశ్రమల డైరెక్టర్లు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటారు.

News September 13, 2025

వరంగల్ మీదుగా వెళ్లే వందే భారత్ రాకపోకల్లో స్వల్ప మార్పులు

image

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల్లో స్వల్ప మార్పులు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య వరంగల్ మీదుగా ప్రస్తుతం గురువారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తున్న ఈ రైళ్లు డిసెంబర్ 5 నుంచి గురువారానికి బదులుగా సోమవారం ట్రిప్పులను రద్దు చేశారు. ఇకనుంచి సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.