News March 2, 2025

అల్లూరి జిల్లాలో టాప్ న్యూస్

image

>పిల్లలు స్ట్రెస్‌కు లోను కాకుండా చూడండి: DEO>అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్> జీకేవీధి:ఆసుపత్రికి వద్దంటూ ఘర్షణకు దిగాడు>అడ్డతీగల: ఉపాధి సిబ్బంది నుంచి సొమ్ము వసూలు>పాడేరు: పించన్లు సద్వినియోగం చేసుకోండి: JC>పాడేరు: చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..SP>అరకు: బడ్జెట్లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..666మంది గైర్హాజరు

Similar News

News October 31, 2025

NLG: ఉదయం బదిలీ… మధ్యాహ్నం డిప్యూటేషన్!

image

నల్గొండలోని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ బదిలీల వ్యవహారం కలకలం రేపుతుంది. ఇక్కడ పనిచేస్తున్న ఓ ఉద్యోగిని మరో చోటికి ఉదయం బదిలీ చేసి మధ్యాహ్నం డిప్యూటేషన్ పై మళ్లీ ఇక్కడికే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే తిరిగి సదరు ఉద్యోగికి యధాతధ పోస్టు అప్పగించడంపై తోటి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆ ఉద్యోగి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరుతున్నారు.

News October 31, 2025

HYD: ‘3 నెలల క్రితమే మంత్రి పదవిపై నిర్ణయం’

image

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అజార్‌పై ఉన్న కేసుల గురించి స్పష్టంగా చెప్పాలంటే కిషన్‌రెడ్డి ముందుకు రావాలని సవాల్ విసిరారు. 3 నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవిపై నిర్ణయం తీసుకున్నామని, దీంతో మైనారిటీలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.

News October 31, 2025

విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

image

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: vpt.shipping.gov.in