News February 25, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: కలెక్టర్
➤ యూజీసీ నెట్లో అన్నవరం యువకుడి ప్రతిభ
➤ నిందితుల గుర్తింపునకు యాప్: రాజవొమ్మంగి ఎస్సై
➤ జాగ్రత్తలు తీసుకుని చికెన్ అమ్ముకోవచ్చు: రంపచోడవరం ఐటీడీఏ పీవో
➤ రహదారి సౌకర్యం కల్పించాలని అనంతగిరి గిరిజనుల పాదయాత్ర
➤ జీకే వీధి మండలంలో ఊరంతా ఏకమై రోడ్డు నిర్మాణం
➤ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అల్లూరి జిల్లాలో వైన్ షాపులు క్లోజ్
Similar News
News February 25, 2026
సిద్దిపేట: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.
News February 25, 2026
రేపు కోదాడకు కేటీఆర్ రాక!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కోదాడకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఇటీవల పోలీస్ లాకప్ డెత్‌లో మృతి చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
News February 25, 2026
ADB: ఉమ్మడి జిల్లాలో 15 వేల పాసుపుస్తకాలు పెండింగ్

6 నెలలుగా పట్టా పాసుబుక్కులు జారీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ADBజిల్లాల్లో రోజుకు 75-100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. డిజిటల్ సిగ్నేచర్ తర్వాత ప్రింటింగ్ ఏజెన్సీ ఇంటి వద్దకే పాసుపుస్తకాలు పంపాలి. ఏజెన్సీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ప్రింటింగ్ నిలిపివేసింది. ప్రభుత్వం ఈబాధ్యతలను మరో ఏజెన్సీకి అప్పగించింది. ఉమ్మడిజిల్లాలో దాదాపు 15వేల పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి.


