News March 10, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అల్లూరి జిల్లాను వీడని చలిగాలులు>దేవీపట్నం: ఎండలకు తగ్గిన పర్యాటకులు>హిట్ లిస్టులో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి..మంప ఎస్సై>పాడేరులో అంగన్వాడీల ఆందోళన>రంప ఏజెన్సీ నుంచి భారీగా తరలివెళ్లిన అంగన్వాడీలు>డుంబ్రిగుడలో షూటింగ్ సందడి >హిందువులపై దాడిపై పాడేరులో ఆందోళన>రంపచోడవరం: నీరు లేక ఎండిపోతున్న వరిపంట>రాజవొమ్మంగి: మంటల్లో కారు>అరకులో మంచినీటి సమస్య

Similar News

News April 17, 2026

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SP సుబ్బరాయుడు

image

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. గురువారం SP కార్యాలయం నుంచి బ్యాంకర్లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులను నమ్మవద్దని కోరారు. OTP, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాల వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.

News April 17, 2026

సౌందర్య.. అచ్చ తెలుగు ఆడపడుచులా!

image

టాలీవుడ్‌లో మహానటి సావిత్రి తర్వాత అంతటి అభిమానం పొందిన హీరోయిన్లలో సౌందర్య ఒకరు. ‘మనవరాలి పెళ్లి’తో 1993లో తెలుగు సినిమాల్లోకి వచ్చి పదేళ్లు సినీరంగాన్ని ఏలారు. 100కుపైగా మూవీస్‌లో నటించారు. అసభ్య వస్త్రధారణకు దూరంగా నిండైన చీరకట్టుతో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించేవారు. కానీ చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. నేడు సౌందర్య వర్ధంతి.

News April 17, 2026

విజయవాడ: ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

image

విజయవాడలో ‘లెమన్ ఎక్స్చేంజ్’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బుకీ చాంద్ బాషా, సబ్ బుకీ పోతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.