News March 13, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్

Similar News

News December 1, 2025

ప్రాజెక్టులను ఆపాలన్న కుట్రలు విఫలమే: సీఎం హెచ్చరిక

image

మక్తల్- NRPT–కొడంగల్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొందరు కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేస్తున్నారని సీఎం తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టులు ఆగవని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందజేస్తామని, ఏ రైతుకు అన్యాయం జరగనీయమని హామీ ఇచ్చారు. మాయగాళ్ల మాటలు నమ్మి అభివృద్ధి ఆపొద్దని రైతులను కోరారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు పెద్దపీట వేస్తామన్నారు.

News December 1, 2025

జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,250

image

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 76 వాహనాల్లో 542 క్వింటాళ్ల విడి పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.7,250, కనిష్టంగా రూ.6,200 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.50 పెరిగింది.

News December 1, 2025

విజయనగరం: ‘లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని జిల్లా జడ్జి ఎం.బబిత న్యాయమూర్తులకు సూచించారు. సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద భీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు వంటి వాటిని ఇరు పార్టీల అనుమతితో శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపారు.