News March 14, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో కనువిందు చేస్తున్న హోళీ పుష్పాలు
>అరకులో హోలీ..కోయ్, కోయ్ ట్రెండ్
>అల్లూరి: లొంగిపోయిన 11మంది మిలీషియా సభ్యులు
>కొయ్యూరు: ఎండల కారణంగా వెలవెలబోతున్న హైవే
>అల్లూరి: ఊబిలో చిక్కుకుని విద్యార్థి మృతి
>అరకు: కాఫీ, మిరియాల రైతులకు బీమా సౌకర్యం కల్పించాలి
>రంపచోడవరం: న్యాయవాదుల కీలక తీర్మానం
>మోదకొండమ్మ ఉత్సవాలకు నిధులు తెచ్చేందుకు కృషి
Similar News
News December 7, 2025
రాష్ట్రస్థాయిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం

హైదరాబాద్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి బాలురు, బాలికల ఖో ఖో ఫైనల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు విజయం సాధించాయి. బాలుర జట్టు రంగారెడ్డి జిల్లాపై, బాలికల జట్టు నల్లగొండ జిల్లాపై గెలుపొందాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా డీఐఈఓలు విద్యార్థులను, కోచ్, మేనేజర్లు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బాబురావును అభినందించారు.
News December 7, 2025
ప్రకాశం: NMMS -2025 పరీక్షకు 196 మంది గైర్హాజరు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన NMMS -2025 స్కాలర్షిప్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 19 కేంద్రాల్లో 4009 మంది విద్యార్థులకు గాను 3813 మంది హాజరయ్యారన్నారు. 196 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని డీఈవో తెలిపారు.
News December 7, 2025
అచ్చంపేట: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి: తాహశీల్దార్

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తహశీల్దార్ సైదులు అన్నారు. రేషన్ షాపులు ప్రతి నెల 1వ తేది నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరచి ఉంచాలన్నారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


