News March 18, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>చింతపల్లి: తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ>పాపికొండల విహార యాత్రలో నైట్ హాల్ట్ లేదు>దేవీపట్నం: పొలంలో ధాన్యం చోరీ>పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి>రాజవొమ్మంగి: చింతపండుకు మద్దతు ధర పెంచాలి>ముంచంగిపుట్టులో తాగునీటి కోసం గిరిజనుల కష్టాలు>అరకు: అసెంబ్లీలో జీసీసీ స్టాల్ ప్రారంభం>పాడేరు: అంగన్వాడీ టీచర్, ఆయాలను నియమించండి>రాజవొమ్మంగిలో యువతి ఆత్మహత్య

Similar News

News September 17, 2025

పెద్దపల్లి బీజేపీ జిల్లా కమిటీని ప్రకటించిన జిల్లా అధ్యక్షుడు

image

పెద్దపల్లి జిల్లా బీజేపీ కమిటీని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులుగా జూలపల్లి మండలానికి చెందిన సీనియర్ నాయకుడు అమరగాని ప్రదీప్ కుమార్, భాస్కర్ రెడ్డి, శనిగరపు రమేష్, చౌదరి మహేందర్, మాచగిరి రాము, కాసగోని నిర్మలలను ఆయన నియమించారు. అలాగే జిల్లా సెక్రటరీలను, సోషల్ మీడియా పలు కమిటీలను నియమించారు.

News September 17, 2025

వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.

News September 17, 2025

పండగ ఆఫర్ల పేరుతో మోసాలు: ఎస్పీ

image

పండగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఇచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. తక్కువ ధరకే లభించే వస్తువుల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిళ్లకు స్పందించవద్దని, సులభంగా డబ్బులు సంపాదించే ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.