News March 20, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>రాజవొమ్మంగి: పెరిగిన పొగాకు పంట సాగు
>పాడేరు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
>మారేడిమిల్లి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
>అనంతగిరి: చందాలెత్తుకుని మట్టి రోడ్డు నిర్మాణం
>డుంబ్రిగుడ: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
>రంప: 300మందికి పవర్ స్ప్రేయర్లు పంపిణీ
>అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
>పాడేరు: వ్యాన్ను ఢీకొని యువకుడు మృతి
Similar News
News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
News March 31, 2025
కంది: నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

సంగారెడ్డి జిల్లాలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులందరూ పూర్తి ఫీజు చెల్లించి 25% రాయితీని పొందాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. 25% రాయితీ గడువు నేటితో ముగుస్తుందని ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 31, 2025
వివాహితపై సామూహిక అత్యాచారం

TG: నాగర్ కర్నూల్ (D) ఊర్కొండ(M)లో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. MBNR జిల్లాకు చెందిన ఆమె బంధువుతో కలిసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాలకృత్యాల కోసం గుట్ట ప్రాంతానికి వెళ్లగా, 8 మంది ఆ బంధువుపై దాడి చేసి అతని చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించిన పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.