News February 26, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్
> నర్సీపట్నంలో కొయ్యూరు మండలవాసి మృతి
> అడ్డతీగలలో ప్రేమ పేరుతో మోసం.. పదేళ్ల జైలు శిక్ష
> జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన అరకు విద్యార్థులు
> మత్స్యగుండానికి 25 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
> పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సామాగ్రి
> గోదావరిలో స్నానాలు చేయవద్దు: దేవీపట్నం ఎస్సై
Similar News
News September 17, 2025
వరంగల్: స్కూల్లో క్షుద్ర పూజల కలకలం..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం సృష్టించింది. నిన్న రాత్రి పసుపు కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం స్కూల్ తెరిచి సరికి చూసి ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
క్షుద్రపూజల ఆనవాళ్లతో గ్రామస్థులు, పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News September 17, 2025
WGL: అయోమయానికి గురిచేస్తున్న పత్తి ధర!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. సోమవారం క్వింటా రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మళ్లీ ఈరోజు(బుధవారం) ధర తగ్గి రూ. 7,440 అయింది. రైతులు తేమలేని, నాణ్యమైన పత్తి మార్కెట్కి తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు
News September 17, 2025
దత్తతతో దేశం దాటి.. మూలాల కోసం మళ్లీ వచ్చింది..!

దత్తతతో దేశం దాటిన మహిళ తన తల్లిదండ్రుల మూలాల కోసం మళ్లీ తిరిగి మాతృ దేశానికి వచ్చింది. వరంగల్ శివనగర్లో తన మూలాలు ఉన్నాయని గుర్తించి చివరకు తన తల్లిదండ్రులను కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 36 ఏళ్ల క్రితం సంధ్యారాణి అనే మహిళ దత్తతతో స్వీడన్ దేశానికి వెళ్లింది. పెరిగి పెద్దై ఉన్నత చదువుల్లో రాణించి 2009 నుంచి అన్వేషించింది. చివరకు తనది పద్మశాలి సామాజిక వర్గమని తెలుసుకుంది.