News March 31, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> ప్రతి గిరిజన గ్రామం అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్యే శిరీషాదేవి
> రాజవొమ్మంగి: ఏజెన్సీలో ఘనంగా రంజాన్
> అల్లూరి జిల్లాలో కిక్కిరిసిన బస్సులు
> అల్లూరి జిల్లాలో సోషల్ స్టడీస్ పరీక్షకు 11,700 మంది: డీఈవో
> రంపచోడవరం: భారత ఇంజనీర్స్ సమాఖ్య డైరెక్టర్గా వెంకయ్య
> పాడేరు: గూడు కట్టాలంటే..మిల్లర్ లాగాల్సిందే..!
> అనంతగిరి: రోడ్డు వేయాలని దండాలు పెట్టి వేడుకోలు
Similar News
News April 4, 2025
పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.
News April 4, 2025
టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం: కిషన్రెడ్డి

వక్ఫ్ సవరణ(UMEED) బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వక్ఫ్ సంస్థల్లో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు, ఆ కమ్యూనిటీలోని పస్మాందాస్, అఘాఖానీస్కు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.