News April 1, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లా వ్యాప్తంగా 93.93 శాతం పెన్షన్లు పంపిణీ>పాడేరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు>రంపచోడవరం: పథకాల అమలుకు రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి>మారేడుమిల్లి: తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్ట్>రాజవొమ్మంగి: పంటను కాపాడుకునేందుకు పాట్లు>పాడేరు: కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం>హుకుంపేట: జనసేన పార్టీలోకి 30మంది చేరిక>అల్లూరి జిల్లాలో 430 నీటి తొట్టెల నిర్మాణం
Similar News
News December 3, 2025
రేపు రాజమండ్రిలో ఉమ్మడి జిల్లా వాలీబాల్ సెలక్షన్స్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలురు, బాలికల వాలీబాల్ ఎంపికలు గురువారం నిర్వహించనున్నట్లు డీఈఓ సలీం భాషా తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయి. 2008 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులు. క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
News December 3, 2025
ముగింపు ‘అఖండ-2’ తాండవమేనా!

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి విడుదలైన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం, OG బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టాయి. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. డిసెంబర్లో బడా చిత్రాల్లో ‘అఖండ-2’తో ఈ ఏడాదికి ముగింపు పలకనుంది. సినిమాపై ఉన్న బజ్ కలెక్షన్లపై ఆశలు రేకెత్తిస్తున్నా బాలయ్య మూవీ రికార్డులు సృష్టిస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
News December 3, 2025
GDK: మహిళలు, అమ్మాయిలు ఈ నంబర్లు SAVE చేసుకోండి

రామగుండం కమిషనరేట్ షీ టీమ్స్కు నవంబర్లో 68 ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. 68 పిటిషన్లలో 15 పిటిషన్లు రామగుండం షీ టీమ్స్కు వాట్సాప్ ద్వారా, మిగతా 53 నేరుగా వచ్చాయని వివరించారు. మహిళలు, విద్యార్థినులు అత్యవసర పరిస్థితుల్లో 6303923700, 8712659386, 8712659386 నంబర్ల ద్వారా షీ టీంలను సంప్రదించాలని సీపీ సూచించారు. SHARE IT.


