News April 2, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> వేసవిలో చిన్నారుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
> స్పాట్ వేల్యుయేషన్కు 683మంది: అల్లూరి డీఈవో
> పాడేరు: నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
> గంగవరం: జీడిపిక్కల కొనుగోలు ప్రారంభం
> కిలో జీడి పిక్కలు రూ.150కు కొనుగోలు..ఎమ్మెల్యే శిరీష
> అరకులో అక్రమ నిర్మాణాలు: ఆదివాసీ గిరిజన సంఘం
> పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షం
Similar News
News November 3, 2025
పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని బ్రాంకియోలైటిస్ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దలకూ రావొచ్చు. 3,4 రోజుల తర్వాత లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వచ్చి, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్లో ఉంచే వైద్యం చేయాలి.
News November 3, 2025
KTR .. నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా: పొంగులేటి

TG: తన <<18177278>>ఇల్లు<<>> FTL పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పడగొడతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లేకపోతే అప్పా జంక్షన్లో ముక్కు నేలకు రాస్తారా? అంటూ KTRకు ప్రతి సవాల్ చేశారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. 500 రోజుల్లో అధికారంలోకి వస్తామన్న మాటల వెనుక BRS ఆలోచన ఏంటో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గులాబీ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
News November 3, 2025
ములుగు: మంత్రి గారూ.. జర చూడండి!

ఏటూరునాగారం(M) దొడ్ల వద్ద అనారోగ్యంతో ఉన్న ఇద్దరు పిల్లలను ఎత్తుకొని తల్లిదండ్రులు పీకల్లోతు <<18184088>>వాగుదాటిన<<>> విషయం తెలిసిందే. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి దయనీయ పరిస్థితులపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వం సమయంలో వాగు ఉద్ధృతి కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఆ 3 గ్రామాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.


