News April 6, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అల్లూరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన ఖరారు>అరకు: పవన్ కల్యాణ్ పర్యటను విజయవంతం చేయండి>అల్లూరి జిల్లాలో కోతులను బెదిరించే మైక్‌లు>అల్లూరి జిల్లాలో ఎటపాక ఫస్ట్..మారేడుమిల్లి లాస్ట్>అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ>రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి>అరకు ఘాట్‌లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు.

Similar News

News September 14, 2025

ప్రకాశం నూతన ఎస్పీ.. తిరుపతిలో ఏం చేశారంటే?

image

ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.

News September 14, 2025

GWL: మావోయిస్టు పోతుల కల్పన కుటుంబ నేపథ్యం

image

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన మావోయిస్టు మహిళా నేత పోతుల కల్పన @ సుజాత తండ్రి కొంత కాలం కిందట మరణించాడు. తల్లి ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. 43 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఆమె స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. అటు తరువాత కుటుంబ సభ్యులను, సన్నిహితులను ఎప్పుడూ కలవలేదు. అనేకసార్లు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆమె అనారోగ్యం కారణంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

News September 14, 2025

HYD: MSMEలకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి

image

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యవస్థాపకులను (MSME) రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బిజినెస్‌ నెట్‌వర్క్‌ఇంటర్నెషనల్‌ బీఎన్‌ఐ(BNI) ఆధ్వర్యంలో శంషాబాద్‌ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌హాలులో ఏర్పాటు చేసిన MSME ఎక్స్‌పోను ప్రారంభించారు. పారాశ్రామికాభివృద్ధికి పక్కరాష్ట్రాల్లో ఉన్న పోర్టులనూ సద్వినియోగం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.