News March 2, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> అల్లూరి జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
> పాడేరు: ప్రవేశ పరీక్షకు 3,939 మంది విద్యార్థులు హాజరు
> పాపికొండల అందాలు చూసిన పర్యాటకులు
> ఓపెన్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO
> బడ్జెట్‌తో ఆదివాసీలకు అన్యాయం
> సీలేరు నదిపై ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి
> పోలవరం నిర్వాసితుల బ్రతుకులతో ఆటలు వద్దు: CPM
Similar News
News October 30, 2025
మొంథా తుఫాను ప్రభావం.. పంట నష్టంపై మంత్రుల సమీక్ష

మొంథా తుఫాను ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి భేటీ అయ్యారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని పొన్నం ప్రభాకర్ వివరించారు. వెంటనే రైతులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 30, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హనుమకొండ కలెక్టర్

మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గర వెళ్లవద్దని, పిల్లలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
News October 30, 2025
విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


