News March 3, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>పాడేరు: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 26 కేంద్రాలు>అల్లూరి: ఇంటర్ పరీక్షలు..224మంది గైర్హాజర్>అల్లూరి: ఓపెన్ ఇంటర్..261మంది గైర్హాజర్>అల్లూరి ఘాట్‌లో జీపు దగ్ధం>కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి>ఘనంగా ప్రారంభమైన మోతుగూడెం కొండ జాతర>దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు భారీ క్రేన్లు >అనంతగిరి: అటవీశాఖ అధికారులు సహకరించాలి
Similar News
News March 23, 2025
KMR: అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గళమెత్తారు

అసెంబ్లీలో కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గళమెత్తారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి అండగా నిలబడాలని ప్రభుత్వాన్ని కోరారు. 22వ ప్యాకేజీ పనులకు నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ కోరారు. మహిళల సాధికారతకు జుక్కల్‌లో పరిశ్రమలు నెలకొల్పాలని MLA తోట లక్ష్మి కాంత్ రావు విన్నవించారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా విస్తరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి రిక్వస్ట్ చేశారు.
News March 23, 2025
కాకినాడ జీజీహెచ్‌ను వదలని జీబీఎస్ కేసులు

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్‌కు రావాలని ఆమె సూచించారు.
News March 23, 2025
కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు