News March 7, 2025
అల్లూరి: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే అల్లూరి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
Similar News
News October 23, 2025
ADB: మంట గలుస్తున్న మానవ సంబంధాలు

కుటుంబాలు ప్రేమ, ఆప్యాయతకు నిలువెత్తు ప్రతిరూపాలు. కానీ ఆ బంధాలు కాస్త కన్నీటి గాథలవుతున్నాయి. మంచిర్యాలలో పండుగపూటే భార్యను భర్త చంపుకోగా, జన్నారంలో మరోచోట కన్న కొడుకే తండ్రిని హతమార్చడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వివాహంపై మామ పెంచుకున్న కక్ష దహెగాంలో కోడలి ప్రాణం తీసింది. పవిత్రమైన అనుబంధాల్లో విషం నింపుతున్న ఈ ఘటనలు, నేటి సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాల విలువలకు అద్దం పడుతున్నాయి.
News October 23, 2025
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
News October 23, 2025
సంగారెడ్డి: ప్రవేశాలకు నేడే చివరి గడువు: డీఈఓ

ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతులలో ప్రవేశం పొందేందుకు గడువు నేటి వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు https://www.navodaya.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.