News March 7, 2025
అల్లూరి: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే అల్లూరి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది.
Similar News
News April 13, 2026
HYD: భర్త డ్యూటీకి.. భార్య వీడియో కాల్స్

ఆడియో, వీడియో కాల్ యాప్స్ సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. HYD సహా ఇతర ప్రాంతాల్లో చదువుకునే వారి నుంచి మహిళల వరకు యువకులకు వల వేస్తూ డబ్బు సంపాదనలో మునిగి, విలువలను మరుస్తున్నారు. మరికొందరేమో భర్త డ్యూటీకి వెళ్లాక అబ్బాయిలతో టైంపాస్ కోసం, జనరల్ టాకింగ్ అంటూ ఇలాంటి యాప్స్‌నకు ఆకర్షితులవుతున్నట్లు Gen-S సర్వే తెలిపింది. భార్య లేనప్పుడు భర్తలు సైతం వీటిలోకి టైమ్ పాస్ అంటూ వస్తున్నట్లు పేర్కొంది.
News April 13, 2026
కొండవీడు కోటపై ‘నైట్ క్యాంపింగ్’.. ప్రకృతి ఒడిలో రాత్రి బస!

పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడు కోటపై పర్యాటకుల కోసం అటవీశాఖ నైట్ టెంట్ క్యాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో రాత్రి బసతో పాటు మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్, సూర్యోదయ వీక్షణ, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ధర పెద్దలకు రూ. 2,000, ఎనిమిదేళ్లలోపు పిల్లలకు రూ. 1,000గా నిర్ణయించారు. వీటితో పాటు ట్రెక్కింగ్, బోటింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలు కూడా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి.
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


