News March 1, 2025
అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని కొయ్యూరు ఎస్ఐ పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి, సహకరించాలని సూచించారు.
Similar News
News December 4, 2025
జడ్చర్ల: విద్యార్థినిపై వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు..!

జడ్చర్ల మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై మహిళ వైస్ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఒక గురుకుల పాఠశాలలో షి టీం ఆధ్వర్యంలో నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తుండగా విద్యార్థిని పోలీసులకు తెలిపింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు విచారణ నిర్వహించి వైస్ ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశారు.
News December 4, 2025
KMM: సర్పంచ్ బరిలో అక్కాచెల్లెళ్లు

స్థానిక ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం ఏకంగా సొంత అక్కాచెల్లెళ్లు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ, స్వతంత్ర అభ్యర్థిగా మల్లెంపుడి కృష్ణకుమారి బరిలో ఉన్నారు. వీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నవారే కావడంతోపాటు కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. కాగా ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని మండలంలో చర్చ జరుగుతోంది.
News December 4, 2025
పాలమూరు: సర్పంచ్ పదవికి MBBS విద్యార్థిని నిఖిత పోటీ

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి వైద్య విద్యార్థిని కే.ఎన్. నిఖిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం తాను నామినేషన్ వేశానని.. గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కాగా ఆమె నామినేషన్ వేయడంతో గ్రామంలోని యువత సైతం అభినందిస్తున్నారు.


