News April 1, 2025
అల్లూరి జిల్లాలో పసిబిడ్డను ఎత్తుకెళ్లింది ఈమనే..!

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల మగ బిడ్డ మంగళవారం మాయమయ్యాడని స్థానికులు తెలిపారు. వై.రామవరం మండలం పాముగంటి వాసి కళావతికి 5 రోజుల క్రితం బిడ్డ పుట్టాడు. పచ్చకామెర్లు ఉన్నాయని ఇంక్యుబేటర్‌లో ఉంచాలని నమ్మించిన ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లిందని చెప్పారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది సీసీ పుటేజ్‌ను పరిశీలించారు.ఆ మహిళ చిత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 28, 2026
HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
News February 28, 2026
చిత్తూరు MLAలకు ఇవి కనబడటం లేదా..?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. టమాటా, మామిడి రైతుల కష్టాల గురించి ఏ ఒక్క MLA ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
News February 28, 2026
WGL: వాళ్లు లోపల.. వీళ్లు బయట!

విధి విచిత్రం అంటే ఇదేనేమో. మావోయిస్టులకు సానుభూతి వ్యక్తం చేశారంటూ పౌరహక్కుల సంఘాల నేతలను అర్బన్ నక్సల్స్ అంటూ జైల్లో పెట్టారు. మావోయిస్టు అంత్యక్రియలకు హాజరైనందుకు గాదె ఇన్నారెడ్డి జైళ్లో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి చనిపోగా, <<19260305>>ఈరోజు తండ్రి సైతం <<>>మరణించారు. మరోపక్క అజ్ఞాతం వీడిన మాజీ మావోయిస్టు నేతలు సీఎం కార్యాలయంలో కుర్చీలపై కూర్చొని ఫొటోలు దిగుతున్నారు. దీన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.


