News February 1, 2025
అల్లూరి జిల్లాలో పాఠశాల భవనం ఆక్రమణ..!

పెదబయలు మండలంలోని బొంగారం ఎంపీపీ పాఠశాల భవనంలో మూడు వారాలుగా బీహార్ వాసులు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు శుక్రవారం తెలిపారు. గమనించిన సర్పంచ్ లక్ష్మీపతి, ఎంపీటీసీ కొండబాబు పాఠశాల భవనం ఖాలీ చేయాలని ఎన్నోసార్లు చెప్పినా వారు గొడవలకు ఎగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 40మంది విద్యార్థులకు వేరే భవనంలో బోధనలు సాగుతుందని ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News December 2, 2025
NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.
News December 2, 2025
చల్వాయి వార్డులను పంచుకున్న మూడు పార్టీలు..!

ములుగు జిల్లా గోవిందరావుపేట(M) చల్వాయి సర్పంచ్ స్థానాన్ని సయోధ్యతో కాంగ్రెస్ దక్కించుకుంది. 14 వార్డులను మూడు ప్రధాన పార్టీలు పంచుకున్నాయి. కాంగ్రెస్కు 7, BRSకు 4, BJPకి 3 చొప్పున తీసుకుంటూ తీర్మానించుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. పొలిటికల్ రింగ్లో నిత్యం తలపడే ఈ మూడు పార్టీలు పల్లె పోరులో మిత్రులుగా మారడం విశేషం. పదవుల పందేరంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని నిరూపణైంది.
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.


