News February 26, 2025
అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(గురువారం) పాడేరు డివిజన్లో అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలు పాటించాలని సూచించారు.
Similar News
News November 22, 2025
గద్వాల డీసీసీ అధ్యక్షుడుగా రాజీవ్ రెడ్డి నియామకం

చాలాకాలంగా పరిశీలనలో ఉన్న డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గద్వాల డీసీసీ అధ్యక్షుడుగా రాజీవ్ రెడ్డిని నియమించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన రాజీవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.