News April 4, 2025

అల్లూరి జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

అల్లూరి జిల్లాలో రాగల 3 గంటల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులు పడవచ్చని తుఫాన్ హెచ్చరిక కేంద్రం శుక్రవారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేసిందని అధికారులు తెలిపారు. 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్కడక్కడా వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, టవర్స్ వద్ద ఉండరాదని, పొలాల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News December 6, 2025

వనపర్తి: నిబంధనలకు లోబడి పని చేయాలి: అదనపు కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించి ప్రజలు, రైతులు, విద్యార్థుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు. శనివారం ఈడీఎం వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 72 మీసేవ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

విశాఖ స్టేడియంలో ‘ఎకో ఫ్రెండ్లీ’ సెల్ఫీ పాయింట్..!

image

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్‌‌ను ACA అధ్యక్షుడు K శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత విశాఖపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం అన్నారు. GVMC, స్వచ్ఛ ఆంధ్ర సహకారంతో ఏర్పాటు చేసిన ఈ పాయింట్ వద్ద ఫొటోలు దిగేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News December 6, 2025

అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

image

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.