News March 13, 2025
‘అల్లూరి జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి’

అల్లూరి జిల్లాలో భూములకు సంబంధించి సరైన రికార్డులు లేవని రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో మార్పులు అవసరమని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి అసెంబ్లీలో బుధవారం అన్నారు. చాలామందికి డి.నమూనా పట్టాలు ఉన్నాయని వీటి ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. వారసత్వం ప్రకారం భూమి విభజన చేసి పట్టాలు అందజేయాలని, చాలామందికి పట్టాలు లేకపోవడం వలన ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నారన్నారు.
Similar News
News October 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.