News September 2, 2024

అల్లూరి జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

image

అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పిఓ అభిషేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్‌లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్‌లను మందలించారు.

Similar News

News September 11, 2024

విశాఖలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

image

సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 11, 2024

విశాఖ: ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

image

విశాఖ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా లబ్ధిదారులను తీసుకెళ్లి జియో ట్యాగింగ్ చేయించాలన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులకు అన్ని విధాల సహకారం అందించాలన్నారు.

News September 10, 2024

విశాఖ: ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12న జాబ్ మేళా

image

విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్‌లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్‌కు సంప్రదించాలన్నారు.