News March 12, 2025
అల్లూరి జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు.!

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ సన్యాసి నాయుడు బుధవారం తెలిపారు. బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి వేరే గ్రామానికి తీసుకుని వెళ్లాడని సీఐ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 25, 2025
సికింద్రాబాద్: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్లాలంటే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలే శరణ్యం. ఇటీవల కాలంలో రైలులో కోచ్ల సంఖ్య సరిపోకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చాలా మంది వీటి సంఖ్యను పెంచాలని అధికారులకు వినతిపత్రాలిచ్చారు. ఈ నేపథ్యంలో కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 14 ఉన్న ఏసీ చైర్ కార్ కోచ్ల సంఖ్యను 16కు పెంచనున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
News November 25, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,27,040కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,16,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ. 1,74,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 25, 2025
BREAKING: హబ్సిగూడలో విషాదం.. 10TH క్లాస్ స్టూడెంట్ సూసైడ్

హబ్సిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. 10వ తరగతి విద్యార్థిని(15) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువ వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపనికి గురై సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకొన్న ఓయూ పోలీసులు మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


