News February 14, 2025
అల్లూరి జిల్లాలో రూ.135కోట్ల బకాయిలు: ఎస్ఈ

అల్లూరి జిల్లాలో దాదాపుగా రూ.135కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని APEPDCL ఎస్ఈ ప్రసాద్ అన్నారు. వాటిని వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. వై.రామవరం విద్యుత్ సబ్ స్టేషన్‌ను శుక్రవారం పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లాలో అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిని గుర్తించి 160 కేసులు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News October 26, 2025
బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.
News October 26, 2025
నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 26, 2025
GNT: రైతుల గుండెల్లో తుఫాన్ గుబులు..!

తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అధిక వర్షాలతో డెల్టాలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం వరి పైరు ఏపుగా పెరుగుతోంది. ఈ సమయంలో తుఫాను వస్తే పంట నీట మునిగి ఎందుకూ పనికి రాదని రైతులు భయపడుతున్నారు.


