News March 9, 2025
అల్లూరి జిల్లాలో రైతు ఆత్మహత్య

రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామానికి చెందిన పి.సత్తిబాబు పొగాకు పంట సక్రమంగా పండలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు ఆదివారం తెలిపారు. సత్తిబాబు 2ఎకరాల్లో వేసిన పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీరవని మనస్తాపంతో 2రోజుల క్రితం పురుగుమందు తాగాడన్నారు. కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్కి తరలించి వైద్యం అందజేయగా.. నేడు మరణించినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 26, 2025
సిద్దిపేటలో మహిళలకే 232 స్థానాలు

సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 508 జీపీలు ఉండగా అందులో మహిళలకే 232 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీ మహిళలకు 8, ఎస్సీలకు 41, బీసీలకు 61, జనరల్- మహిళలకు 122 స్థానాలు రిజర్వు చేశారు. అయితే 42 % ఆశించిన బీసీలకు 26.7 % మాత్రమే దక్కాయి. జిల్లాల మొత్తం ఓటర్లు 6,55,958 మంది ఉండగా అందులో పురుషులు 3,21,766 మహిళలు 3,34,186, ఇతరులు 6 మంది ఉన్నారు.
News November 26, 2025
మార్కాపురం జిల్లా.. బలాలు మీకు తెలుసా..?

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడగా జిల్లా బలాలపై సరికొత్త చర్చ సాగుతోంది. జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తైతే జిల్లా మరింత సస్యశ్యామలం కానుంది. కొత్త జిల్లా ఏర్పడిన కొన్ని నెలల్లోనే వెలుగొండ జలాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండవ చెరువైన కంభం చెరువు, నల్లమల అందాలు కొత్త జిల్లాకు బలమే కాక, సరికొత్త అందాలుగా కూడా చెప్పవచ్చు.
News November 26, 2025
HNK: ఈసారి ఎలక్షన్స్లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

హన్మకొండ మండలంలో మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.


