News March 9, 2025

అల్లూరి జిల్లాలో రైతు ఆత్మహత్య

image

రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామానికి చెందిన పి.సత్తిబాబు పొగాకు పంట సక్రమంగా పండలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు ఆదివారం తెలిపారు. సత్తిబాబు 2ఎకరాల్లో వేసిన పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీరవని మనస్తాపంతో 2రోజుల క్రితం పురుగుమందు తాగాడన్నారు. కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌కి తరలించి వైద్యం అందజేయగా.. నేడు మరణించినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 15, 2026

కామారెడ్డి: రేపే అన్ని వివరాలతో కూడిన తుది ఓటర్ల జాబితా

image

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పూర్తిస్థాయి తుది ఓటర్ల జాబితాను(ఫోటోలతో కూడిన) అన్ని వివరాలతో రేపు అధికారులు ప్రకటించనున్నారు. మొత్తం 92 వార్డుల తుది జాబితాలో పురుషులు, మహిళలు, ఇతరుల వారీగా ఓటర్ల వివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే బూత్‌ల వివరాలు, మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా ఏ వార్డు కు ఏ రిజర్వేషన్ వస్తుందోనని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

News January 15, 2026

BREAKING: HYD: అడవిలో విషపు కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

image

పటాన్‌చెరు నియోజకవర్గంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు వివరాలు.. రామచంద్రాపురం పరిధి బండ్లగూడలో బిహార్‌కు చెందిన 8 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు స్థానిక అడవిలోకి వెళ్లారు. అక్కడ చెట్లకు ఉన్న విషపు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు గమనించగా అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.