News May 3, 2024

అల్లూరి జిల్లాలో 130 ఏళ్ల ఉద్యమరాలు మృతి..! 

image

అల్లూరి మన్యంలో పితూరి ఉద్యమంలో పాల్గొన్న మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం ఈతరొబ్బలు గ్రామానికి చెందిన పలాస సోములమ్మ గురువారం ఉదయం 8 గంటలకు మృతి చెందిందని తెలిపారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగిందని.. 1924లో పిండి కుండల పితూరిలో పాల్గొన్నట్లు చెప్పారు. సోములమ్మ వయసు సుమారు 130 ఏళ్లు ఉంటుదని వారు తెలిపారు.

Similar News

News January 9, 2026

విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

image

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News January 9, 2026

విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.