News March 6, 2025

అల్లూరి జిల్లాలో 650మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో గురువారం జరిగిన ప్రథమ ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. మాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 6624మంది రాయవలసి ఉండగా 6169మంది హాజరు అయ్యారని, 455ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1336మందికి గాను 1141మంది రాసారని, 195మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

Similar News

News November 6, 2025

ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

image

తాలిబన్స్‌తో ఓ టీ మీట్‌తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్‌లోకి వచ్చారన్నారు. వారితో పాక్‌లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.

News November 6, 2025

బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.

News November 6, 2025

వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

image

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.