News March 6, 2025
అల్లూరి జిల్లాలో 650మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో గురువారం జరిగిన ప్రథమ ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. మాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 6624మంది రాయవలసి ఉండగా 6169మంది హాజరు అయ్యారని, 455ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1336మందికి గాను 1141మంది రాసారని, 195మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
Similar News
News March 5, 2026
వేధింపులకు భయపడొద్దు.. ఫిర్యాదు చేయండి: సిరిసిల్ల ఎస్పీ

సిరిసిల్ల జిల్లాలో విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే గురువారం సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తూ విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News March 5, 2026
బాపట్ల: ఇంటర్ పరీక్షలకు 191 మంది ఆబ్సెంట్

బాపట్ల జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి జుబేర్ తెలిపారు. తొమ్మిదో రోజు పరీక్షకు మొత్తం 2,785 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 2,594 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మిగిలిన 191 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News March 5, 2026
మంచిర్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

మంచిర్యాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ‘పరిశుభ్రత – మన బాధ్యత’ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. 100 శాతం చెత్త సేకరణ చేస్తామని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్తబుట్టలనే వాడాలని సూచించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేస్తామని, మున్సిపాలిటీకి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


