News March 5, 2025

అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షకు 6, 773 మంది హాజరు కావాల్సి ఉందన్నారు. 6,324 మంది పరీక్షలు రాశారని.. 449మంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పారు. 8 కేంద్రాల్లో 1,355మందికి 1,154 మంది ఒకేషనల్ పరీక్ష రాశారని చెప్పారు. 201 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News March 21, 2025

తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

image

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.

News March 21, 2025

ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

image

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.

News March 21, 2025

ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

image

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.

error: Content is protected !!