News April 4, 2024
అల్లూరి జిల్లాలో 67 శాతం పింఛన్లు పంపిణీ

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67 శాతం పింఛన్లు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 135 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్కు సోమవారం 135 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఒక్క ప్రాజెక్టు తెచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా: గంటా

వైసీపీ హయాంలో మొదలు పెట్టి, పూర్తి చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు చూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ చేశారు. ఎంవీపీ కాలనీ క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కియా వంటి చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయిందని మండిపడ్డారు.