News February 18, 2025
అల్లూరి జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలు: డీఈవో

పదోతరగతి పరీక్షలకు అల్లూరి జిల్లాలో 71 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. పాడేరు డివిజన్లో 43, రంపచోడవరం డివిజన్లో 18, చింతూరు డివిజన్లో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 202 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారని వెల్లడించారు. 100రోజులు ప్రణాళికతో విద్యాబోధన జరుగుతుందన్నారు.
Similar News
News November 25, 2025
కుర్రాళ్ల ఓపికకు ‘టెస్ట్’!

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో మన కుర్రాళ్లు తేలిపోతున్నారు. ఒకప్పుడు సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ రోజుల తరబడి క్రీజులో నిలబడేవారు. బౌలర్ల సహనాన్ని పరీక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్లేయర్లు పరుగులు చేయడం అటుంచితే కనీసం గంట సేపైనా ఓపికతో మైదానంలో ఉండలేకపోతున్నారు. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానేల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన పంత్, నితీశ్, సుదర్శన్, జురెల్ దారుణంగా విఫలమవుతున్నారు.
News November 25, 2025
పలాస జిల్లా లేనట్లేనా..?

పలాస కేంద్రంగా ఉద్దానం ఏరియాను జిల్లాను చేయాలనే డిమాండ్ ఇక్కడి ప్రజల్లో ఉంది. గత ప్రభుత్వం పలాసను జిల్లా చేస్తామని ప్రకటించినప్పటికీ.. కేవలం రెవెన్యూ డివిజన్గా మార్చి వదిలేసింది. జిల్లాగా ప్రకటించకపోవడంతో పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈప్రభుత్వంలోనైనా ఏర్పాటు అవుతుందని అందరూ భావించారు. దీనిపై అసలు చర్చే లేకపోవడంతో జిల్లా లేనట్టేనని తెలుస్తోంది.
News November 25, 2025
ప్రొద్దుటూరులో జువెలరీ దుకాణం మూత..! బాధితుల గగ్గోలు

ప్రొద్దుటూరులోని తనకంటి జ్యూవెలరీ దుకాణం మూడు రోజులుగా మూత పడింది. దాంతో బంగారు సరఫరాదారులు, ఆభరణాలకు అడ్వాన్స్ ఇచ్చిన వారు, స్కీముల్లో, చీటిల్లో డబ్బులు కట్టిన వారంతా ఆందోళన చెందుతున్నారు. డబ్బులు కట్టినవారికి జీఎస్టీ రసీదులివ్వకుండా, చీటీలు రాసి ఇవ్వడంతో బాధితులు గగ్గోలు చెందుతున్నారు. వ్యాపారి శ్రీనివాసులును చీటింగ్, కిడ్నాప్, దాడి కేసుల్లో పోలీసులు విచారణ చేస్తుండడంతో ఆందోళన పడుతున్నారు.


