News March 11, 2025
అల్లూరి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాలు

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మంగళవారం పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 258 పాఠశాలలకు చెందిన 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలురు 5,476, బాలికలు 6,290 మంది ఉన్నారు. నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 20 సెంటర్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Similar News
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.
News December 6, 2025
స్ఫూర్తిని రగిలించే డా.అంబేడ్కర్ మాటలు

➛ ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం
➛ మేకల్ని బలి ఇస్తారు. పులుల్ని కాదు. పులుల్లా బతకండి
➛ మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే
➛ ప్రజలకు ఓటు హక్కే ఆయుధం. పోరాడి రాజులవుతారో అమ్ముకుని బానిసలవుతారో వారి చేతుల్లోనే ఉంది
➛ విశ్వాసం కలిగి ఉండండి. ఆశను కోల్పోకండి
* ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి *
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ఏఐ కెమెరాలతో నిఘా.!

ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. దీంట్లో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వీటి ద్వారా డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోనున్నారు. ఏఐ కెమెరాలు వీటిని పసిగట్టి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందిస్తాయి. తద్వారా ప్రమాదాలు తక్కువయ్యే అవకాశం ఉంది.


