News February 4, 2025
అల్లూరి జిల్లాలో 8 సెంటర్లు: డీఈవో

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం, టైం టేబుల్ ప్రకారం ఇంటర్(APOSS) పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరుగుతాయని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 8 సెంటర్లు కేటాయించామన్నారు. అరకులోయ-1, పాడేరు-1, చింతూరు-1, చింతపల్లి -2, రంపచోడవరం-3 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 1699 మంది పరీక్షలు రాయనున్నారని తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News November 22, 2025
ఏపీ కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్‌గా ఎమ్మిగనూరు నేత

కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నేత మిన్నప్పకు కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. మిన్నప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. బీవీకి, సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
News November 22, 2025
బిచ్కంద: రోడ్డుపై వడ్లు.. ఒకరి ప్రాణం తీసింది!

వడ్ల కుప్ప కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బిచ్కుంద SI మోహన్ రెడ్డి వివరాలిలా..లచ్చన్ వాసి కీర్తి రాజ్ (35) బరంగ్ ఎడిగి నుంచి బిచ్కుంద వైపు తన బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఖత్గావ్ చౌరస్తా సమీపంలో ఆరబోసిన వరి ధాన్యం కుప్పను కీర్తి రాజ్ బైక్‌తో ఎక్కించి, అదుపు తప్పి రోడ్డుపై పడి, అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.


