News March 21, 2025

అల్లూరి జిల్లాలో 89మంది విద్యార్థులు గైర్హాజర్

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం 71పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి ఇంగ్లిష్ ఎగ్జామ్ జరిగింది. వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 11547మంది విద్యార్థులకు 11458మంది హాజరయ్యారని, 89మంది ఆబ్సెంట్ అయ్యారని DEO. బ్రాహ్మజీరావు తెలిపారు. చింతపల్లిలో 4 సెంటర్స్‌ను ఆయన తనిఖీ చేశారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News December 3, 2025

వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా మల్లికార్జున

image

చిలమత్తూరులోని బీసీ కాలనీకి చెందిన ఎన్.మల్లికార్జున‌ను వాల్మీకి సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడిగా నియమించినట్లు సంఘం వ్యవస్థాపకుడు పులి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు సంఘానికి, మద్దతు తెలిపిన వాల్మీకులకు మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు. వాల్మీకి–బోయ వర్గాల అభివృద్ధి, ఎస్‌టీ సాధన కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.

News December 3, 2025

PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

image

⋆HYD​ మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలి
⋆RRR ఉత్తర, దక్షిణ భాగం​ నిర్మాణానికి, మన్ననూర్​-శ్రీశైలం 4 వరుసల ఎలివేటేడ్​ కారిడార్‌కు అనుమతులివ్వాలి. RRR వెంట రీజనల్​ రింగ్​ రైలు ప్రాజెక్టును చేపట్టాలి
⋆HYD-అమరావతి-మచిలీపట్నం​ పోర్ట్ 12 లేన్ల​ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే, HYD-BLR గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి చొరవ చూపాలి

News December 3, 2025

ఏఐతో అశ్లీల ఫొటోలు.. X వేదికగా రష్మిక ఫిర్యాదు

image

అసభ్యకరంగా మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు వైరల్ కావడంతో హీరోయిన్ రష్మిక Xలో ఘాటుగా స్పందించారు. ‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అని కోరుతూ ‘Cyberdost’కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.