News February 2, 2025
అల్లూరి జిల్లాలో 95.69% పింఛను పంపిణీ పూర్తి

అల్లూరి జిల్లాలో శనివారం రాత్రి 9 గంటలకు 95.69% పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా 22 మండలాల్లో 1,23,361 మంది పించన్ దారులకు 51.74 లక్షల సొమ్ము రిలీజ్ అయిందన్నారు. వీటిలో 1,18,041 మందికి రూ. 49.40లక్షల సొమ్ము పింఛన్లు పంపిణీ చేసామన్నారు. మిగిలిన 5,615 మందికి త్వరితగతిన పింఛను పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అరకులోయలో కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు.
Similar News
News November 6, 2025
గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.
News November 6, 2025
వీరుల రక్తపు ధారలు ప్రవహించిన పల్నాడు

నాటి వీరులు వాడిన ఆయుధాలనే దేవతలుగా పూజించే ఆచారం పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పోతురాజుకు పడిగం కట్టి పల్నాటి వీరుల ఉత్సవాలకు పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ్ శ్రీకారం చుట్టారు. ఈ నెల 19 నుంచి 23 వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. మినీ మహాభారతంగా, ఆంధ్ర కురుక్షేత్రంగా పిలవబడే పల్నాటి యుద్ధ సన్నివేశాలను ఈ ఉత్సవాలలో నిర్వహిస్తారు.
News November 6, 2025
ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి అచ్చెన్న

రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఆధైర్యపడాల్సిన అవసరం లేదని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉల్లి ధరలు పతనమైనప్పుడు రైతులు పడిన శ్రమ వృథా కాకుండా ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేసింది. రాష్ట్రంలోని ఉల్లి రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా రక్షించాలనే భావనతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.


