News March 28, 2025

అల్లూరి జిల్లాలో 99 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 99 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని DEO బ్రాహ్మజిరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో 11,659 మంది విద్యార్థులు బయాలజికల్ సైన్స్ రాయవలసి ఉండగా 11,560 మంది రాసారని, 99.15 శాతం హాజరు అయ్యారని తెలిపారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News December 1, 2025

WhatsApp: కొత్త నిర్ణయంతో తిప్పలు తప్పవు!

image

కేంద్రం తెస్తున్న <<18424391>>‘సిమ్ బైండింగ్’<<>> రూల్ కొందరు వాట్సాప్ యూజర్లపై ప్రభావం చూపనుంది. ఏ నంబర్‌తో యాప్ వాడితే సిమ్ ఆ మొబైల్‌లో ఆన్‌లో ఉండాలనే రూల్‌తో ఫారిన్ ట్రిప్స్ వెళ్లే వారికి, సిమ్ లేని వారికి ఇబ్బందే. ప్రస్తుతం ఆఫీస్ నంబర్‌తో లింకైన అకౌంట్లు మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్‌లో ఉంటాయి. కానీ ప్రతి 6గం.కు వెబ్ వర్షన్స్ ఆటో- లాగౌట్ నిర్ణయంతో రి-లాగిన్, చాట్స్ లోడింగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్.

News December 1, 2025

ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.

News December 1, 2025

ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

image

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.