News March 28, 2025

అల్లూరి జిల్లాలో 99 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 99 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని DEO బ్రాహ్మజిరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో 11,659 మంది విద్యార్థులు బయాలజికల్ సైన్స్ రాయవలసి ఉండగా 11,560 మంది రాసారని, 99.15 శాతం హాజరు అయ్యారని తెలిపారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News April 18, 2025

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

image

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.

News April 18, 2025

సంగారెడ్డి: జిల్లాకు వచ్చిన యూనిఫామ్ క్లాత్

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే ఉచిత యూనిఫామ్ క్లాత్ ఈ సంవత్సరం కూడా జిల్లా కేంద్రానికి చేరుకుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ మండలాలకు పంపించనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు యూనిఫామ్‌ను కుట్టి పాఠశాలల ప్రారంభం నాటికి అందించాలని డీఈఓ పేర్కొన్నారు.

News April 18, 2025

NRML: రైల్వే స్టేషన్లో గొడవ.. బ్లేడ్‌తో మెడపై కోశాడు

image

నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కుంచెపుబాబు నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుకింగ్ కౌంటర్ వద్ద పడుకొని ఉండగా ఓ వ్యక్తి బ్లేడుతో మెడపై కోశాడు. పై ఫోటోలో ఉన్న వ్యక్తి నిన్న బాధితుడి వద్దకు వచ్చి గొడవ పెట్టుకొని బ్లేడ్‌తో బాబు మెడపై కట్ చేశాడని రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఫోటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే తమకు, పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.

error: Content is protected !!