News February 25, 2025

అల్లూరి జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ఆధార్ కార్డులు నమోదు చేయడానికి అధిక వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. మీసేవా కేంద్రాలు, నెట్ సెంటర్లలో నకిలీ జనన ధ్రువపత్రాలతో ఆధార్ నమోదు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. నెట్ సెంటర్లలో నకిలీ ఆధార్ కార్డుల జారీపై అధికారులు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలన్నారు.

Similar News

News November 28, 2025

‘అమరావతిలో పరిష్కారమైన లంక భూముల సమస్య’

image

రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు  లంక భూమలు ఇచ్చిన రైతుల సమస్య పరిష్కారం అయిందని మంత్రి నారాయణ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతుల ప్లాట్‌లకు  రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని, లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం కల్పించామన్నారు.

News November 28, 2025

అభ్యర్థులకు నల్గొండ కలెక్టర్ కీలక సూచన

image

పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో ఎక్కడా కూడా ఖాళీగా వదిలి వేయవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాల్లో అంశాలు ఏవైనా తమకు వర్తించకపోతే నాట్ అప్లికేబుల్ (NA) లేదా నిల్ అని రాయాలన్నారు. ఖాళీగా వదిలేస్తే మాత్రం అభ్యర్థిత్వం తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాలను రాయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.

News November 28, 2025

NLG: లావాదేవీలు జరగని డబ్బు.. తీసుకునేందుకు అవకాశం

image

జిల్లాలో ఆయా బ్యాంకుల్లో లావాదేవీలు జరగని డబ్బు వివిధ ఖాతాల్లో రూ.2.04 కోట్లు ఉంది. ఖాతాదారులు మృతిచెందడం, నామిని వివరాలు లేకపోవడం, డబ్బులు డిపాజిట్ చేసిన విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం తదితర కారణాలతోపాటు బ్యాంకుల్లో డబ్బు ఎక్కడికి పోతాయనే ధీమాతో డబ్బును అలాగే ఉంచుతున్నారు. బ్యాంకు వారిని కలిసి మొత్తాన్ని తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ అవకాశం కల్పించింది.