News February 25, 2025
అల్లూరి జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ఆధార్ కార్డులు నమోదు చేయడానికి అధిక వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. మీసేవా కేంద్రాలు, నెట్ సెంటర్లలో నకిలీ జనన ధ్రువపత్రాలతో ఆధార్ నమోదు చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామన్నారు. నెట్ సెంటర్లలో నకిలీ ఆధార్ కార్డుల జారీపై అధికారులు తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
News March 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

గాండ్లపెంట మండలం తూపల్లి పంచాయతీ వంకపల్లిలో సచివాలయ ఉద్యోగి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 24, 2025
గద్వాల: గడువు కాలం మరో మూడు నెలలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువు రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పెంచింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి నూతన అక్రిడేషన్ జారీ చేయకుండా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ గడువు కాలాన్ని పెంచుతుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.