News June 30, 2024
అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు
భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.
Similar News
News January 16, 2025
నక్కపల్లి: బాలుడిని కాపాడబోయి మృత్యువాత పడిన యువకుడు
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో <<15167020>>బాలుడిని<<>> కాపాడబోయిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈనెల 15వ తేదీన సముద్రతీరంలో బాలుడు మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన మణికంఠ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన యువకుడు గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల సముద్రతీరానికి కొట్టుకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 16, 2025
విశాఖ: స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరిన ప్రజలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. దీంతో జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. మరికొందరు సొంత వాహనాలతో తిరుగుపయనం అవుతున్నారు.
News January 16, 2025
విశాఖలో అనిల్ అంబానీ భారీ పెట్టుబడి!
విశాఖ జిల్లాకు మరో భారీ పెట్టుబడి రానుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ విశాఖలో 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే జిల్లాలో అనువైన భూములను పరిశీలించినట్లు సమాచారం. త్వరలోనే ఒక ప్లేస్ను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే అనీల్ అంబానీ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో భూములను పరిశీలించిన సంగతి తెలిసిందే.