News February 4, 2025

అల్లూరి: ట్యాంకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

జాతీయ రహదారి పనుల్లో భాగంగా వాటరింగ్ చేస్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టడంతో క్లీనర్ నాగరాజు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని మట్టపనుకుల వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాగరాజు ట్యాంకర్ క్రింద ఉండిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుని స్వగ్రామమైన ఎం.మాకవరంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్ వర్మ తెలిపారు.

Similar News

News November 21, 2025

ఆ రూ.360 కోట్లు ఇవ్వాలి: రోజా

image

మామిడి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని రోజా ఆరోపించారు. ‘చిత్తూరు జిల్లాలో 4.50లక్షల టన్నుల తోతాపురిని రైతులు ప్యాక్టరీలకు తోలారు. కిలోకు ప్రభుత్వం రూ.4, ప్యాక్టరీలు రూ.8 ఇస్తామని చెప్పారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం రూ.180కోట్లు ఇచ్చింది. ప్యాక్టరీలు రూ.8 కాకుండా రూ.4 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వ మోసంతో రైతులు రూ.180 కోట్లు నష్టపోతారు. రూ.360 కోట్లు ఇచ్చేలా చూడాలి’ అని రోజా ట్వీట్ చేశారు.

News November 21, 2025

స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

image

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ బైపోల్‌కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.

News November 21, 2025

NRPT: ఆర్టీఐకి స్పందన కరువు.. విచారణకు నోటీసులు

image

దామరగిద్ద మండలంలో కంది, వేరుశనగ విత్తనాల పంపిణీ, రైతు బీమా లబ్ధిదారుల వివరాలు కోరుతూ సెప్టెంబరు 23న ఆర్టీఐ దరఖాస్తు చేసినా స్పందన రాలేదు. దీంతో అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్‌కు అప్పీల్ చేసినట్లు ఆర్టీఐ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కొనింటి నర్సింలు తెలిపారు. దీనిపై ఏడీఏ స్పందించి, విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.