News February 4, 2025
అల్లూరి: ట్యాంకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

జాతీయ రహదారి పనుల్లో భాగంగా వాటరింగ్ చేస్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టడంతో క్లీనర్ నాగరాజు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని మట్టపనుకుల వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాగరాజు ట్యాంకర్ క్రింద ఉండిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుని స్వగ్రామమైన ఎం.మాకవరంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్ వర్మ తెలిపారు.
Similar News
News January 15, 2026
పాలమూరులో సంక్రాంతి సంబరాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. భోగిని రొట్టెల పండుగగా, సంక్రాంతిని పులగం, కనుమను తునకల పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అరిసెలు, ప్రత్యేక వంటకాలతో పల్లెలు సందడిగా మారాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జిల్లావ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తోంది.
News January 15, 2026
VZM: ఇక రైళ్లలో టీ, కాఫీ విక్రయాలు కొత్తగా ఇలా..

వాల్తేరు రైల్వే డివిజన్ ప్రయాణికులకు శుభవార్త. టీ, కాఫీ విక్రయాల కోసం సరికొత్త ‘హైటెక్ వేరబుల్ గ్యాడ్జెట్’ను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభించారు. ఈ ఇన్సులేటెడ్ పరికరం ద్వారా పానీయాలు ఎక్కువసేపు వేడిగా, పూర్తి పరిశుభ్రంగా లభిస్తాయి. వెండర్స్ మెడలో ధరించే ఈ గ్యాడ్జెట్‌లో డిజిటల్ పేమెంట్, వేస్ట్ కలెక్షన్ సౌకర్యం ఉండటం విశేషం. ఇది ప్రయాణికులకు సురక్షితమైన సేవలను అందిస్తుంది.
News January 15, 2026
GNT: రాజధాని భూముల్లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్!

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 2వ విడతగా 20,494 ఎకరాల భారీ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజధాని ప్రాంతంలో సందడి మొదలైంది. ఈ భూముల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్ వంటి మెగా ప్రాజెక్టులు రానున్నట్లు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల అనుసంధానంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు రాబోతుందనే అంశంపై స్థానిక ప్రజల్లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.


