News February 10, 2025

అల్లూరి: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది దాఖలు చేశారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News November 9, 2025

మాగంటి మృతిపై విచారణ జరపాలని తల్లి ఫిర్యాదు

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిపై అనుమానాలున్నాయని ఆయన తల్లి మహానంద కుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిపై విచారణ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు మాగంటి మరణంపై సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <<18218398>>కేటీఆర్‌ను<<>> ఆమె డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

News November 9, 2025

కమనీయంగా వేములవాడ రాజన్న కళ్యాణం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు రాజన్న ఆలయ అర్చకులు, వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం జరిపించారు.

News November 9, 2025

HYD: అవినీతి పాలనకు ముగింపు పలకాలి: BJP

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళ్‌రావునగర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా BRS పాలనలో.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ HYD అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, ప్రజలు ఈసారి అవినీతి, మోసపూరిత పాలనకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.