News February 10, 2025

అల్లూరి: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది దాఖలు చేశారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Similar News

News March 19, 2025

కురుమూర్తిలో రూ.110 కోట్లతో అభివృద్ధి పనులు: భట్టి

image

ఉమ్మడి MBNR జిల్లాలోని పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో విడుదల చేసిన రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలైనట్లు చెప్పారు.

News March 19, 2025

బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.

News March 19, 2025

కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

image

TG బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ‘ఇందిర గిరి జల వికాసం’ పేరుతో నూతన స్కీమును అమలు చేయనున్నట్లు తెలిపింది. పోడుభూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటి సరఫరా చేయనుంది. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులు, తోటల పెంపకానికి ప్రోత్సాహం అందివ్వనుంది. 2.1 లక్షల రైతులకు ఈ సౌకర్యం కల్పించనుంది. నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ.12,600 కేటాయిస్తామని పేర్కొంది.

error: Content is protected !!