News March 27, 2025

అల్లూరి: నేడు ఈ 10 మండలాల ప్రజలు జాగ్రత్త

image

అల్లూరి జిల్లాలలో నేడు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్డతీగల, చింతూరు, దేవిపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, నెలిపాక, రాజవొమంగి, రంపచోడవరం, వరరామచంద్రపుర్ లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.

Similar News

News July 9, 2025

భువనగిరి: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరిలో జరిగింది. మోత్కూర్‌కు చెందిన నీరటి కవితకు గుండాల మండలం షాపూర్‌కు చెందిన బాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భువనగిరిలో నివాసముంటున్న కవితను భర్త తరచూ వేధించేవాడిగా తెలుస్తోంది. మానసికంగా హింసించడంతో ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 9, 2025

MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

image

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.

News July 9, 2025

విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. ABVP ప్రస్థానమిదే!

image

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) 77వ వసంతంలోకి అడుగు పెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగమైన ఈ సంస్థను 1949 జులై 9న ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ‘రాష్ట్రీయ ఛత్ర దివస్’ (జాతీయ విద్యార్థి దినోత్సవం)గా కార్యకర్తలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులలో జాతీయవాద భావనను పెంపొందించడం, విద్యా సంస్కరణలను ప్రోత్సహించడం, విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ABVP పనిచేస్తోంది.